పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ కొత్త వీడియోను ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విడుదల చేసింది. ‘పక్కా ప్రణాళికతో, తగిన శిక్షణతో దీనిని అమలు చేశాం. న్యాయం జరిగింది’ అని భారత సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్ ఈ వీడియోలో పేర్కొంది. భారత సైన్యం పశ్చిమ కమాండ్ విడుదల చేసిన ఈ వీడియోలో ఒక సైనికాధికారి మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ అనేది పాకిస్థాన్‌కు ఒక గుణపాఠం. దశాబ్దాలుగా వారు నేర్చుకోని పాఠం ఇది’ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa