గుల్జార్ హౌస్ లో అగ్నిప్రమాదం సంభవించిన ప్రదేశానికి ఫైరింజన్లు చేరుకున్నా వాటిలో నీళ్లు లేకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలపై చూపిస్తున్న శ్రద్ధను అగ్ని ప్రమాదాల నివారణపై కూడా చూపాలని సూచించారు. ఇలాంటి దుర్ఘటనల్లో ఇంకో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని కేటీఆర్ సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, "రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారించాలి" అని స్పష్టం చేశారు. కేవలం ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
![]() |
![]() |