రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తుంటారు. మంచి ధర కోసం దాన్ని నిల్వ చేస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ధాన్యం నిల్వ చేసే ముందు ఎండలో ఆరబెట్టాలి. అలాగే పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు. వీలైనంత వరకు కొత్త సంచుల్లోనే నిల్వ ఉంచాలి. ఇక గోనె సంచుల్లో 10 శాతం వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి. లేదా 5 శాతం వేప గింజల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను ఉపయోగించాలి.
![]() |
![]() |