కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికుల కోడ్‌లకు వ్యతిరేకంగా మంగళవారం నారాయణపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఐటీయూ మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు యాదగిరి మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక, కర్షక సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa