బుధవారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి పుస్తకాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలను ఉద్యోగార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
పోటీ పరీక్షలకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను బహుకరించినందుకు గ్రంథాలయ సిబ్బంది ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విద్యా సాగర్ రెడ్డి, వెంకటేష్, గడ్డం నరేశ్, సిబ్బంది నరసింహారెడ్డి, కట్టా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa