హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించేవారికి ఒక శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఈ సవరించిన, తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీనితో ప్రయాణికులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది.ఇటీవల హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని సవరిస్తూ ఛార్జీలను తగ్గించారు. కొత్తగా సవరించిన ధరల ప్రకారం, మెట్రోలో ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.11గానూ, గరిష్ఠ ఛార్జీ రూ.69గానూ నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa