శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తిరుమలగిరి మండలం మామిడాలకు చెందిన కుర్ర శంకర్ (30) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
మంగళవారం వల్లాల నుంచి కారులో బయలుదేరి వెళుతుండగా, వంగమర్తి శివారులో డీసీఎంను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa