విందులు, వినోదాల కోసం అందాల పోటీలు నిర్వహించారని BRS నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన BRS కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన సమావేశంలో మాట్లాడారు.
అందాల పోటీల నిర్వహణపై హరీశ్‌రావు తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఈ పోటీల కోసం రూ.200 కోట్లు వెచ్చించారు. అయితే, మిస్ ఇంగ్లాండ్ ఈ పోటీల్లో అనుచిత ప్రవర్తన జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా, చెడ్డపేరు మాత్రమే వచ్చింది" అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa