ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 10:50 AM

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు విధిగా హాజరు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, మినీ కిట్‌లను రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగుపై వ్యవసాయాధికారులు తగిన సలహాలు, సూచనలు అందజేస్తారని, ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa