రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ శనివారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంతర్గం మండలానికి చెందిన 194 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa