వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో సోమవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆర్. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేయడంతో అనేకమంది కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు మరియు వారి పిల్లలు సంక్షేమ పథకాలకు నోచుకోలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ లోటును పూరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa