అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురిచేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బెంగాల్‌కు చెందిన తల్లీ కుమారులు శ్వేతాఖాన్, ఆర్యన్‌ఖాన్‌లు ఓ యువతిని ఉద్యోగం పేరిట ట్రాప్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్‌గా పని చేయాలని బలవంతం చేయగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఫోన్ లాక్కొని ఫ్లాట్‌లో బంధించారు. బాధితురాలు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa