తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కొత్తగా నియమితులైన మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా ఢిల్లీకి బయల్దేరినట్లు సమాచారం. ఈ పరిణామాలు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులకు సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa