టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ ప్లాట్‌ఫారమ్‌లో పోస్టు చేసింది. కాగా, చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa