వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 'మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' నినాదంతో మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వరరావు, ఎమ్మార్వో హసీనా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పలువురు అధికారులు పాల్గొన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని తుంగతుర్తి రవి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa