తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల జారీని అమలుపరిచింది. ఇందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండలం, మల్కాపూర్ గ్రామంలో మంజూరైన రేషన్ కార్డుల పత్రాలను కార్యదర్శి నాగరాజు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మన్నె తిరుపతి మాట్లాడుతూ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసిందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa