జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు మెయిల్ పంపడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాఠశాలలు, కళాశాలలు, విమానాశ్రయాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa