TG: సంగారెడ్డి జిల్లా వడక్ పల్లి గ్రామ శివారులో భార్యను భర్త కట్టెతో కొట్టి చంపాడు. భర్త బానోతు రాజు (48)కు భార్య భానోత్ సరోజ (44)కు కొన్ని రోజులు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మద్యం సేవించి వచ్చి గొడవపడి కట్టెతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. నిందితుడు గతంలో భార్యను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. వీరు కూలి పనుల కోసం నిజామాబాద్ నుంచి అక్కడికి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa