హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఈ నెల 3వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa