TG: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కారు డ్రైవర్, బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa