TG: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన డ్రైవర్ రమ్ నాగిన యాదవ్ (53) ఓ దాబా వద్ద శనివారం అర్ధరాత్రి భోజనం చేసిన అనంతరం లారీని పక్కన నిలిపి పడుకునే క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa