జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై సర్వే సంస్థలు అంచనాలు వెల్లడించాయి. చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 06% ఓట్లు సాధించవచ్చని అంచనా. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 06% గా ఉంది. స్మార్ట్ పోల్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ 48.2%, బీఆర్ఎస్ 42.1% ఓట్లు పొందవచ్చని, నాగన్న సర్వేలో కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 08% గా అంచనా వేయబడింది. ఈ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa