రాష్ట్రంలో త్వరలో సీఎం మార్పు ఖాయమని వస్తున్న ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త సీఎంను నియమించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ డోకా లేదు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, పీసీసీగా నేనే ఉంటాం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తాం. నాకు మంత్రి పదవిపై ఆశ లేదు' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa