విమానాశ్రయాన్ని తలపించే అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపంలోకి రానుంది. ఇప్పటికే దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 13 నెలల్లో ఈ స్టేషన్ పూర్తిగా ప్రయాణికుల సేవలోకి రానుందని అధికారులు తెలిపారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నిలిచింది.151 ఏళ్ల చరిత్ర – కొత్త అవతారం సుమారు 151 ఏళ్ల క్రితం అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేడు 10 ప్లాట్‌ఫారమ్‌లతో నిత్యం కిక్కిరిసే కేంద్రంగా మారింది. రోజుకు వందకు పైగా రైళ్లు ఇక్కడ నుంచి నడుస్తున్నాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.ఇప్పుడు వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చుతున్నారు. అనేక అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ కొత్తగా ఆవిష్కృతం కానుంది.రూ.715 కోట్లతో అత్యాధునిక మౌలిక వసతులుప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రూ.715 కోట్ల వ్యయంతో రీడిజైన్ పనులు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.“హైదరాబాద్‌కు మణిహారం లాంటి ప్రతిష్ఠాత్మక కేంద్రంగా సికింద్రాబాద్ స్టేషన్ నిలుస్తుంది,” అని ఆయన అన్నారు.కొత్త స్టేషన్‌లో 3 వేల మందికి పైగా ప్రయాణికులు కూర్చునే వెయిటింగ్ హాల్స్, ఆధునిక క్యాంటీన్ స్టాళ్లు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు కానున్నాయి. విమానాశ్రయాల్లో కనిపించేలా 2 ట్రావలేటర్లు, ఎయిర్ కాంకోర్స్ మరియు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇవి వాహన రద్దీని తగ్గించడమే కాకుండా పార్కింగ్ సమస్యకు కూడా చెక్ పెడతాయి.స్కైవేలు – కనెక్టివిటీకి కొత్త దారులు మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌లోకి చేరుకునేలా ప్రత్యేక స్కైవేలు నిర్మాణం జరుగుతోంది. అదనంగా, స్టేషన్ నుంచి బస్టాండ్‌ల వరకు నడిచే పాదచారుల మార్గాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత రోజుకు రెండు లక్షలకుపైగా ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించగలరని అధికారులు అంచనా వేస్తున్నారు.2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి ప్రారంభం రూ.715 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా సిద్ధమవుతుంది. నిర్మాణ పనులు దశలవారీగా పూర్తి అవుతున్నాయని, అన్ని సదుపాయాలు సిద్ధమైన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa