ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై–నర్సాపూర్ వందే భారత్ స్టార్ట్..! టైమింగ్స్ తెలుసా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:51 PM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రయాణికుల నుంచి కొత్త హాల్ట్‌ల కోసం డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.ఇదే నేపథ్యంలో చెన్నై–విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ నియోజకవర్గ ప్రజలు కోరారు. ఈ డిమాండ్‌కు రైల్వే శాఖ అంగీకరించడంతో, ఈ రోజు నుంచే చెన్నై–విజయవాడ వందే భారత్ రైలు నరసాపురం వరకు విస్తరించి ప్రయాణిస్తోంది.వందే భారత్ రైలు మార్గం పొడిగింపుతోపాటు కొత్త టైమింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.దీని ప్రకారం, చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వైపు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20677) ఉదయం 5.25కు బయలుదేరుతుంది. ఇది రేణిగుంటకు ఉదయం 7.05కు, నెల్లూరుకు 8.29కు, ఒంగోలుకు 9.43కు, తెనాలికి 11.08కు, విజయవాడకు 11.40కు, గుడివాడకు 12.29కు, భీమవరం టౌన్‌కు మధ్యాహ్నం 1.14కు చేరుకొని, చివరగా నరసాపురానికి మధ్యాహ్నం 2.10కు చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో, వందే భారత్ రైలు నంబర్ 20678 మధ్యాహ్నం 2.50కు నరసాపురం నుంచి బయలుదేరుతుంది. ఇది 3.19కు భీమవరం టౌన్, 4.04కు గుడివాడ, 4.50కు విజయవాడ, 5.19కు తెనాలి, 6.29కు ఒంగోలు, 7.39కు నెల్లూరు, 9.50కు రేణిగుంట మీదుగా ప్రయాణించి రాత్రి 11.45కు చెన్నై సెంట్రల్‌ స్టేషన్ చేరుకుంటుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ సమయాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. నరసాపురం వరకు పొడిగింపుతో మారిన టైమింగ్స్ మరియు స్టేషన్లను ప్రయాణికులు గమనించాల్సిందిగా సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa