ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన ఉగ్రవాద చర్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:46 PM

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం "ఉగ్రచర్య"గా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఎర్రకోట వద్ద కారు పేలుడు రూపంలో దేశ వ్యతిరేక శక్తులు ఘోరమైన ఉగ్రదాడికి పాల్పడ్డాయి. ఉగ్రవాదంపై దాని అన్ని రూపాల్లోనూ జీరో టాలెరెన్స్ విధానానికే భారత్ కట్టుబడి ఉందని కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది" అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa