ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిర్సా ముండా జయంతి సందర్బంగా బీజేపీ నాయకుల నివాళులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 02:57 PM

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్‌ను నిర్వహిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందరో నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను బయటికి రాకుండా చేసిందని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa