గ్రామపంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణీ కుముదిని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, ఏ విడత ఎక్కడ పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీ-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa