జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమా రాయుడు హత్య కేసును పోలీసులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసును, లోతైన దర్యాప్తు ద్వారా పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్ అని తేల్చి, ప్రధాన నిందితులతో సహా 10 మందిని అరెస్టు చేశారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా మిల్లు వీరన్న, అతని కుమారుడు కుర్వ సురేందర్, బోయ వీరన్నలను గుర్తించారు. వీరితో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన మరో ఏడుగురిని కూడా అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కోసం నిందితులు సుపారీ గ్యాంగ్‌కు రూ. 25 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa