సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, హైదరాబాద్లోని అన్ని స్టేషన్ల అభివృద్ధిని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. హైటెక్ సిటీతో పోటీపడేలా ఆ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, రూ.35కోట్లతో జరుగుతున్న పనుల్లో తొలి విడత ఫిబ్రవరిలోగా పూర్తవుతుందని తెలిపారు. సంక్రాంతికి ఇక్కడ 16 ప్రత్యేక రైళ్లు ఆగుతాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa