రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీ+3 విధానంలో అదనంగా 2 లక్షల నుంచి 4 లక్షల మందికి సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. 'తెలంగాణ రైజింగ్ విజన్-2047'లో భాగంగా గృహ నిర్మాణ రంగంలో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసింది. నిర్మాణ రంగాన్ని వినూత్న పద్ధతుల్లో అభివృద్ధి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ‘క్యూర్, ప్యూర్, ఆర్వోఎస్’ అనే మూడు కీలక విధానాలను రూపొందించింది. ఈ ప్రణాళికలపై రూపొందించిన నివేదికను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa