తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ స్టేజీ వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని, ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa