ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంత్యక్రియలకు డబ్బులు లేక మూడు రోజులుగా మృతదేహంతోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 02:20 PM

హైదరాబాద్‌లోని షాపూర్ సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతోనే గడిపింది. అనారోగ్యంతో మరణించిన స్వామిదాస్ (76) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దుస్థితిని ఎదుర్కొంది. మూడు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పందించి, ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa