ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 04:39 PM

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణతల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసిందని, ఆ రోజు ప్రజల పోరాట ఫలితాలను స్మరించుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని కలెక్టర్ తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa