రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన దుబ్బాక సాగర్, అన్ని రకాల పంట పొలాలు, తోటలకు మందులు, ఎరువులు స్ప్రే చేయడానికి ఆధునిక డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో సమర్థవంతంగా స్ప్రే చేయవచ్చని తెలిపారు. ఈ సేవలను జిల్లెల్ల గ్రామ సర్పంచి దుబ్బాక రజిత శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa