TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కవేలి గూడ వద్ద ఓ యువకుడిని గొంతు కోసి గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు మొయినాబాద్ మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్(26)గా గుర్తించారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa