రైల్వే శాఖ టికెట్ చార్జీలను పెంచింది, ఇవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 215 కిలోమీటర్ల వరకు జనరల్ క్లాస్‌లో మార్పు లేదు. 216-750 కి.మీ ప్రయాణానికి రూ.5, 751-1250 కి.మీకు రూ.10, 1251-1750 కి.మీకు రూ.15, 1751-2250 కి.మీకు రూ.20 అదనంగా చెల్లించాలి. స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు పైసా చొప్పున పెరిగాయి. మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ), రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa