ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. అల్లుడి పై గొడ్డ‌లితో దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 02:57 PM

TG: కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముదెల్లి గ్రామానికి చెందిన నర్సింహులు, అతనికి వరుసకు అల్లుడు అయ్యే రంజిత్, మరో వ్యక్తి బాలయ్య కలిసి నిన్న రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో రంజిత్, నర్సింహులు మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహానికి లోనైన నర్సింహులు గొడ్డలితో రంజిత్ పై దాడి చేశాడు. ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa