తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఏపీలోని మన్యంలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పాడేరు ఏజెన్సీలో 5-9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట 24-25, రాత్రిపూట 18-19 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. చలి తీవ్రతతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa