తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని, గతేడాది 2,34,158 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2,28,69 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బీఎన్ఎస్ కేసుల్లోనూ 1.45 శాతం తగ్గుదల కనిపించిందని, నేర నిరూపణ శాతం 3.09 శాతం పెరిగి 38.72 శాతానికి చేరిందని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్ష విధించబడిందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa