పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యోగా టీచర్ హసీనా (53) రాంచీలో జరిగిన 50వ జూనియర్, సీనియర్ జాతీయ స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్-2025లో తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొని తృతీయ స్థానంలో నిలిచి భారత రికార్డును కైవసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా యోగా నిపుణులు పాల్గొన్న ఈ పోటీల్లో ఆమె గెలుపొందడం విశేషం. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే యోగాలో శిక్షణ పొంది, తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు ఆమెకు చాంపియన్ ట్రోఫీ, మెడల్ అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa