జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించనున్నారు. ఆయన 96 గదుల సత్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జేఎన్టీయూ కాలేజీలో హెలిప్యాడ్ స్థలాన్ని కూడా పరిశీలించారు. పవన్ పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa