బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ తీవ్రంగా స్పందించారు. వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, అక్కడ ఓ హిందువును సజీవ దహనం చేయడం దారుణమని అన్నారు. విద్వేష రాజకీయాల దుష్పరిణామం కారణంగా హత్య జరిగిందని, ఇది దక్షిణాసియాను సిగ్గుపడేలా చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.బంగ్లాదేశ్‌లో గత డిసెంబర్ నెలలో మైమెన్సింగ్ జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో దీపూ చంద్ర దాస్‌పై మూక దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత కళిమొహర్ యూనియన్‌లోని హొసైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్‌పై దాడి చేసి హతమార్చారు. రెండు రోజుల క్రితం షరియత్‌పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకోన్ దాస్‌పై దాడి చేసి, అనంతరం నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలపై బోయలపల్లి రేఖ స్పందించారు.అక్కడి హిందువులు మమ్మల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించడం బంగ్లాదేశ్‌లో క్షీణించిన మానవతా విలువలకు అద్దం పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హత్యను ఒక సాధారణ ఘటనగా కొట్టిపారేయలేమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa