ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీకి కూనంనేని సాంబశివరావు క్షమాపణ చెప్పాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 01:21 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై కూనంనేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.అసెంబ్లీ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలకు ఏమాత్రం స్థానం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోవడానికి ఇలాంటి బాధ్యతలేని, అసభ్యకరమైన భాషే కారణమని విమర్శించారు.తెలంగాణ అసెంబ్లీలో అటువంటి వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa