ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్ విగ్రహాల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 07:06 PM

బుధవారం రాంసింగ్పురలోని గిర్కపల్లి మూసి నది సమీపంలో ఉన్న గణేష్ విగ్రహాల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa