ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయవాది స్వప్న దారుణ హత్య: న్యాయవాదుల భద్రతపై ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 08:01 PM

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లోని కేతిరెడ్డి పల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆమె హత్యతో న్యాయవాద సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై న్యాయవాది కొంగళ్ల నవీన్ మాట్లాడుతూ, "చట్టాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరం. న్యాయవాదుల భద్రతను నిర్ధారించడంలో వ్యవస్థ విఫలమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు' ను వెంటనే చట్టరూపంలోకి తీసుకురావాలి" అని డిమాండ్ చేశారు. ఈ హత్య న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలన్నారు ఈ నిరసనలో న్యాయవాదులు ముల్క వెంకట్ రెడ్డి, రంగారావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, తమ్మినేని హనుమంతరావు, కరీం, నయీమ్, హుస్సేన్, చలం, రామ్ రెడ్డి, రంజాన్, భాష, దొడ్డ శ్రీధర్, రియాజ్, శ్రీనివాస్, అవినాష్, హేమలత, పాషా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa