ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం జాతరలో బాలికపై అత్యాచారం జరగలేదు: NCW

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 03:08 PM

ములుగు జిల్లాలోని మేడారం జాతరలో ఓ బాలికపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని జాతీయ మహిళా కమిషన్ (NCW) తేల్చి చెప్పింది. SMలో వచ్చిన కథనాల ఆధారంగా NCW మెంబర్లు మేడారంలో పర్యటించారు. 'బాలికపై అత్యాచారం జరిగిందని రూమర్లు వచ్చాయి. అందుకే ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించాం. అలాంటి ఘటన జరగలేదని గుర్తించాం. ఈ న్యూస్ కవర్ చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పోలీసులకు అపాలజీ లెటర్ ఇచ్చారు' అని NCW మెంబర్ డెలినా ఖోంగ్‌దుప్ తెలిపారు.వివరాలు... మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క- సారలమ్మ మహా జాతర జరిగిన సంగతి తెలిసిందే. జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా ప్రచారం జరిగింది. వాష్ రూమ్‌కు వెల్లిన బాలికను పొదల్లోకి తీసుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు కొందరు ప్రచారం చేశారు. బాలికపై అత్యాచార ఆరోపణలపై మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa