హిందూపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగే కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో నైరుతి రైల్వే (South Western Railway) మార్పులు చేసింది. రైళ్ల సమయపాలనను మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత సవ్యంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20704) హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. ముందుగా ఈ రైలు 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరేది.అదే విధంగా కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుంది. ఇంతకుముందు ఇది 12.08 గంటలకు చేరుకుని, 12.10 గంటలకు బయలుదేరేది.ప్రయాణికులు ఈ కొత్త సమయాలను గమనించి తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైళ్ల ఆలస్యాన్ని తగ్గించి, సేవలను మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలిపారు.ఇక యశ్వంతపూర్–కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. బుధవారం ఈ రైలు సేవలు ఉండవు. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మార్గంగా యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa