ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా దినోత్సవం: సర్పంచ్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 03:47 PM

మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల్ లోని చిల్వేర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మార్చి 8న జరగాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే, అనగా 07-03-2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీ బొల్గమ్ నాగరాజు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి R. S. S శ్యామలాకుమారి, మధ్యాహ్న భోజన వర్కర్ శ్రీమతి బంగారమ్మ, మరియు అంగన్వాడి ఆయా శ్రీమతి అనితలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు C. వెంకటయ్య, గురుప్రసాద్ గౌడ్, హర్యా, రమేష్ గౌడ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa