ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి నిరాకరించిన అమ్మాయి.. 'హెచ్ఐవీ' ఇంజెక్షన్ ఇచ్చిన యువకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 06:18 PM

ప్రస్తుత సమాజంలో సినిమాలను మించిన క్రూరమైన ఘటనలు నిజ జీవితాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. సినిమాల్లోని విలన్ క్యారెక్టర్ల మాదిరిగే కొందరు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ శివారు పోచారంలో అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి ఖాయమైంది. ఇప్పటికే షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా.. మనోహర్‌కు ఎయిడ్స్ (HIV) ఉన్నట్లు ఇతర బంధువుల ద్వారా అమ్మాయి తరపు కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో సదరు యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకోని తన జీవితం నాశనం చేసుకోలేనంటూ యువతి పెళ్లిని నిరాకరించింది. ఈ మేరకు అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి తల్లిదండ్రులకు విషయం చెప్పారు.


తనతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవటాన్ని మనోహర్ జీర్ణించుకోలేకపోయాడు. బంధువులు, గ్రామంలో పరువు పోయిందని భావించాడు. తన పెళ్లి రద్దవ్వడానికి ఆ యువతే కారణమని భావించి ఆమెపై పగ పెంచుకున్నాడు. సినిమాల్లో మాదిరిగా ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్‌ను పట్టుకున్నారు.


అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాధితురుల ఆసుపత్రిలోనే ఉంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేశారు. ఇలా ఒక యువతి జీవితంతో ఆడుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయమని ఇప్పుడా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని ఫైరవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa